||సుందరకాండ ||

|| మూడవ సర్గ తాత్పర్యముతో||

|| Sarga 3 || with Slokas and Summary in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ తృతీయ సర్గః

శో|| స లమ్బ శిఖరే లమ్బే లమ్బతోయద సన్నిభే|
సత్త్వమాస్థాయ మేధావీ హనుమాన్మారుతాత్మజః||1||
నిశి లఙ్కాం మహోసత్త్వో వివేశ కపికుంజరః|
రమ్యకానన తోయాఢ్యాం పురీం రావణపాలితామ్||2||

స|| స మేధావీ మారుతాత్మజః తోయద సన్నిభే లంబ శిఖరే సత్త్వమ్ అస్థాయ (సః) మహాసత్త్వః కపికుంజరః రమ్యకానన తోయాడ్యాం రావణపాలితాం లఙ్కాం వివేశ||

తా|| ఆ మేధావి అయిన మారుతాత్మజుడు మేఘములను అంటుకుంటున్న శిఖరముపై సుందరమైన అరణ్యములతోనూ జలాశయములతోనూ వున్న రావణునిచే పాలించబడు లంకానగరమును ప్రవేశించెను.

శో|| శారదాంబుర ప్రఖ్యైః భవనైరుపశోభితామ్|
సాగరోపమనిర్ఘోషాం సాగరానిలసేవితామ్||3||
సుపుష్ఠబలసంపుష్ఠాం యథైవ విటపావతీమ్|
చారుతోరణ నిర్యూహాం పాణ్డురద్వారతోరణామ్||4||
భుజగాచరితాం గుప్తాం శుభాం భోగవతీ మివ|
తాం సవిద్యుద్ఘనాకీర్ణం జ్యోతిర్మార్గనిషేవితామ్||5||
మందమారుత సంచారాం యథేంద్రస్య అమరావతీమ్|
శాతకుంభేన మహతా ప్రాకారేణాభిసంవృతామ్||6||
కింకిణీజాలఘోషాభిః పతాకాభిరలంకృతామ్|
అసాద్య సహసా హృష్టః ప్రాకారమభిపేదివాన్||7||

స|| ( హృష్టః సహసా ప్రాకారం ఆసాద్య) శారదామ్బుధర ప్రఖ్యైః భవనైః ఉపశోభితామ్ సాగరోపమ నిర్ఘోషామ్ సాగరా నిలసేవితామ్ (తాం లఙ్కాం అభిపేదివాన్)|| సుపుష్ఠ బలసంపుష్ఠామ్ యథైవ విటపావతీం చారుతోరణ నిర్యూహామ్ పాణ్డురద్వార తోరణామ్ (తాం లఙ్కాం అభిపేదివాన్) || భుజగా చరితాం గుప్తాం శుభాం భోగవతీం ఇవ (దృశ్యామ్ తాం లఙ్కాం అభిపేదివాన్)| సవిద్యుత్ ఘనాకీర్ణమ్ జ్యోతిర్మార్గ నిషేవితామ్ తాం (లఙ్కాం అభిపేదివాన్) || మందమారుత సంచారాం మహతా శాతకుంభేన ప్రాకారేణ అభిసంవృతాం యథా ఇంద్రస్య అమరావతీం (తాం లఙ్కాం అభిపేదివాన్)|| కింకిణీ జాలఘోషాభిః పతాకాభీః అలంకృతామ్ (తాం లఙ్కాం) హృష్టః సహసా ఆసాద్య ప్రాకారం అభిపేదివాన్||

తా||శరత్కాలపు మేఘములవలెనున్న భవనములతో శోభించుచున్న, సాగరఘోషతో సమానమైన ఘోషలతో నున్న, సాగరవాయువులచేత సేవింపబడిన ,విటపావతి నగరములాగా బలిష్టులైన సైనికులతో వున్న, సుందరమైన తోరణములు తెల్లని ముఖద్వారములు గల, పాములతోనిండి రక్షింపబడు భోగవతీ నగరము వలె శుభకరముగా నున్న, మెఱుపులతో కూడిన మేఘములచే ఆవరింపబడిన, జ్యోతిర్మార్గమును అందుకునుచున్న, మెల్లగా వీచుచున్నమారుతముతో సెవింపబడుచున్న, బంగారు ప్రాకారములతో చుట్టబడి ఇంద్రుని యొక్క అమరావతి లా వున్న, చిరిగజ్జెల ధ్వనులతో ఎగురుచున్నపతాకములతో అలంకరింపబడిన లంకానగరమును సంతోషమైన మనస్సు కలవాడై తోందరగా ఆ ప్రాకారమును చేరుకొనెను.

శో|| విస్మయావిష్ఠహృదయః పురీమాలోక్య సర్వతః|
జాంబూనదమయైర్ద్వారైః వైఢూర్యకృతవేదికైః ||8||
వజ్రస్ఫటికముక్తాభిః మణికుట్టిమభూషితైః|
తప్తహాటకనిర్యూహై రాజతామలపాణ్డురైః||9||
వైఢూర్యకృతసోపానైః స్ఫాటికాంతర పాంసుభిః|
చారుసంజవనోపేతైః ఖమివోత్పతై శ్శుభైః||10||
క్రౌంచబర్హిణసంఘుష్ఠైః రాజహంసనిషేవితైః|
తూర్యాభరణనిర్ఘోషైః సర్వతః ప్రతినాదితామ్||11||
వస్వౌకసారాప్రతిమాం తాం వీక్ష్య నగరీం తతః |
ఖమివోత్పతితుం కామాం జహర్ష హనుమాన్ కపిః||12||

స|| సర్వతః (స)జామ్బూనదమయైః ద్వారైః (స)వైఢూర్యకృత వేదికైః పురీం ఆలోక్య విస్మయా విష్ఠహృదయః , వజ్ర స్ఫటికముక్తాభిః (స)మణికుట్టిమభూషితైః తప్తహాటకనిర్యూహైః రాజతామలపాణ్డురైః ,(స)వైఢూర్యకృత సోపానైః (స)స్ఫాటికాంతర పాంసుభిః చారుసంజవనోపేతైః ఖమివోత్పత్తైః శుభైః , క్రౌంచబర్హిణ సంఘుష్ఠైః రాజహంస నిషేవితైః తూర్యాభరణ నిర్ఘోషైః ప్రతినాదితాం ఖమివోత్పతితుం వస్వౌకసారాప్రతిమాం తాం నగరీం వీక్ష్య హనుమాన్ కపిః జహర్ష||

తా|| అన్నివైపులా బంగారుతో రూపొందించిన ద్వారాలతో, వైఢూర్యములతో అలంకరింపబడిన వేదికలతో వున్న, వజ్రములు స్ఫటికములతోనూ, మణులతోనూ అలంకరింపబడిన సోపానములు గల, వేడిబంగారముతో పూయబడిన ప్రతిమలతో, వెండిలా తెల్లగావున్నవైఢూర్యములతో అలంకరింపబడిన సోపానములతో నున్న,స్ఫటిక మాణిక్యాల కుప్పలతో నున్న, క్రౌంచపక్షులు నెమళ్ళు తిరుగాడుచున్న, రాజహంసలు తిరుగాడుచున్న, వాద్యముల ఆభరణముల ధ్వని ప్రతిధ్వనులతో నిండిన, వస్వౌకసారా అనబడు స్వర్గలోకనగరములాగ ఆకాసములోకి ఎగిరిపోతున్నదా అన్నట్లు వున్న ఆ లంకానగరమును చూచి హనుమంతుడు ఎంతో ఆనందపడెను.

శో|| తాం సమీక్ష్య పురీమ్ రమ్యాం రాక్షసాధిపతే శ్శుభామ్|
అనుత్తమాం వృద్ధియుతాం చింతయామాస వీర్యవాన్||13||

స|| శుభాం రమ్యాం అనుత్తమాం వృద్ధియుతాం రాక్షసాధిపతేః తాం పురీం వీక్ష్య వీర్యవాన్ హనుమతః చిన్తయామాస||

తా|| శుభమైన రమ్యమైన ఉత్తమమైన మంగళప్రదమైన సుందరమైన ఐశ్వర్యముతో తులతూగుచున్న ఆ నగరమును చూచి పరాక్రమశాలి అయిన హనుమంతుడు అలోచించసాగెను.

శో|| నేయమన్యేన నగరీ శక్యా ధర్షయితుం బలాత్ |
రక్షితా రావణ బలైః ఉద్యతాయుధదారిభిః ||14||

స||ఉద్యతాయుధధారుభిః రావణ బలైః రక్షితా ఇయం నగరో అన్యేన బలాత్ ధర్షయితుం న శక్యా||

తా|| రావణ బలగములచే రక్షింపబడుచున్న ఈ నగరము ఇంకొకరిచేత బలముతో జయింపబడ శక్యము కాదు.

శో|| కుముదాఙ్గదయోర్వాపి సుషేణస్య మహాకపేః|
ప్రసిద్ధేయం భవేత్ భూమిః మైన్దద్వివిదయో రపి||15||

స|| ఇయం భూమిః కుముదాఙ్గదయోర్వాపి మహాకపేః సుషేణస్య మైన్దద్వివిదయోరపి ప్రసిద్ధా భవేత్||

తా|| ఈ భూమి కుముదుడు అంగదుడు మహాకపి అగు సుషేనుడు మైందుడు ద్వివిదుడు మున్నగు వారికి తెలిసివుండవచ్చు.

శో|| వివస్వత స్తనూజస్య హరేశ్చ కుశపర్వణః|
ఋక్షస్య కేతుమాలస్య మమ చైవ గతిర్భవేత్ ||16||

స|| (ఇయం భూమిః) వివస్వతః తనూజస్య హరేః కుషపర్వణః ఋక్షస్య కేతుమాలస్య మమ చ గతిః భవేత్||

తా||వివస్వతుని కుమారుడు వానారాధిపతి అగు సుగ్రీవుడు, కుశపర్వుణుడు, ఋక్షుడు , కేతుమాలుడు నేను ఇక్కడికి రాగలము.

శో|| సమీక్ష్యతు మహాబాహూ రాఘవస్య పరాక్రమమ్|
లక్ష్మణస్య విక్రాన్తం అభవత్ప్రీతిమాన్ కపిః||17||

స|| కపిః మహాబాహుః రాఘవస్య పరాక్రమం లక్షమణస్య విక్రాన్తం చ సమీక్ష్య ప్రీతిమాన్ అభవత్ ||

తా||హనుమంతుడు మాహాబాహువు అయిన రాఘవుని పరాక్రమము , లక్ష్మణుని పరాక్రమము తలచుకొని ఆనందభరుడాయెను.

శో|| తాం రత్న వసనోపేతాం కోష్ఠాగారావతంసకామ్|
యంత్రాగారాస్తనీమృద్ధాం ప్రమదామివ భూషితామ్||18||
తాం నష్ఠతిమిరాం దీప్తైర్భాస్వరైశ్చ మహాగృహైః|
నగరీం రాక్షసేంద్రస్య స దదర్శ మహాకపిః||19||

స|| సః మహాకపిః భాస్వరైశ్చ దీప్తైః నష్ఠతిమిరాం మహాగృహైః తాం రాక్షసేన్ద్రస్య నగరీం రత్న వసనోపేతాం కోష్ఠాగారవతంసకామ్ యన్త్రాగారాం స్తనీం ఋద్ధాం భూషితామ్ ప్రమదామివ దదర్శ ||

తా|| ఆ మహావానరునుకి బాగావెలుగుచున్న దీపములచేత పారదోలబడిన చీకటి కల రాక్షసరాజు నగరి రత్నకాంతులనే వస్త్రములు కల, కోష్టాగారములనే కనభూషణములు కల, యంత్త్రాగారములనే స్తనములు కల, స్త్రీవలె కనిపించెను.

శో|| అథ సా హరిశార్దూలం ప్రవిశంతం మహాబలః|
నగరీస్వేన రూపేణ దదర్శ పవనాత్మజమ్||20||

స|| అథ మహాబలః హరిశార్దూలం ప్రవిశంతం పవనాత్మజం సా నగరీ స్వేన రూపేణ దదర్శ||

తా|| అప్పుడు అలా ప్రవేశించుచున్న మహబలుడు, వానరులలో శార్దూలమువంటి వాడు,పవనాత్మజుడగు హనుమంతుని ఆ నగరదేవత తన స్వరూపములో చూచెను.

శో|| సా తం హరివరం దృష్ట్వా లఙ్కారావణపాలితా|
స్వయమేవోథ్థితా తత్ర వికృతానన దర్శనా||21||

స|| రావణపాలితా సా లఙ్కా తం హరివరం దృష్ట్వా వికృతానన దర్శనా తత్ర స్వయమేవ ఉత్థితా ||

తా|| రావణునిచే పాలింపబడు వికృతమైన కళ్ళు కల ఆ లంకానగరి ఆ వానరోత్తముని చూచి అక్కడే అతనిముందు లేచి నిలబడెను.

శో|| పురస్తాత్ కపివర్యస్య వాయుసూనోరతిష్ఠత|
ముఞ్చమానా మహానాదం అబ్రవీత్ పవనాత్మజమ్||22||

స|| కపివర్యస్య వాయుసూనోః పురస్తాత్ అతిష్ఠత | మహానాదం ముఞ్చమానా పవనాత్మజం అబ్రవీత్||

తా||వాయుపుత్రుడగు కపివర్యుని ముందర నుంచొనెను. మహానాదము చేస్తూ పవనాత్మజుని తో ఇట్లనెను.

శో|| కస్త్వం కేన చ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ|
కథయ స్వేహ యత్తత్వం యావత్ప్రాణాధరంతి తే ||23||

స|| (హే) వనాలయ కః త్వం| కేన కార్యేణ ఇహ ప్రాప్తః చ| యావత్ తే ప్రాణాః ధరన్తి ఇహ యత్ తత్త్వం (తత్) కథయస్వ||

తా|| 'ఓ వనాలయా నీవు ఎవరు ? ఏకారణము వలన ఇక్కడికి వచ్చినావు? నీవు ప్రాణాలు ధరించి వున్నసమయంలో యధార్థము చెప్పుమ'.

శో|| న శక్యం ఖల్వియం లఙ్కా ప్రవేష్ఠుం వానర త్వయా |
రక్షితా రావణ బలైః అభిగుప్తాసమంతతః||24||

స|| (హే) వానర రావణ బలైః సమన్తతః రక్షితా అభిగుప్తా లఙ్కా ప్రవేష్ఠుం త్వయా న శక్యం||

'ఓ వానరా రావణ బలములతో అన్నివిధములుగా రక్షింపబడిన లఙ్కా నగరములోకి నీకు ప్రవేశించుటకు శక్యము కాదు'.

శో|| అథ తామబ్రవీద్వీరో హనుమానగ్రతస్థితామ్|
కథయిష్యామి తే తత్త్వం యన్మాం త్వం పరిపృచ్ఛసి||25||
కా త్వం విరూపనయనా పురద్వారే అవతిష్ఠసి|
కిమర్థం చాపి మాం రుద్ద్వా నిర్భర్త్సయసి దారుణా||26||

స|| అథ అగ్రత స్థితామ్ తాం వీరః హనుమాన్ అబ్రవీత్| యత్ త్వాం మాం పరిపృచ్ఛసి తత్త్వం తే కథయిష్యామి|| హే దారుణా విరూప నయనా పురద్వారే అవతిష్ఠసి కా త్వం | కిం అర్థమ్ మాం రుద్ధ్వా నిర్భర్త్ససి |

తా||అప్పుడు వీరుడు హనుమంతుడు తన ముందు నుంచినివున్న ఆమె తో ఇట్లు పలికెను. "నువ్వు నన్ను ఏమి అడుగుతున్నావో దానికి యదార్థము చెప్పెదను.ఓ దారుణమైన వికృతమైన కన్నులుగలదానా పురద్వారములో నుంచుని ఉన్న నీవు ఏవరవు? ఎందుకు కొరకునన్నుఆపి భయపెట్టుచున్నావు?

శో|| హనుమాద్వచనం శ్రుత్వా లఙ్కా సా కామరూపిణీ|
ఉవాచ వచనం క్రుద్ధా పరుషం పవనాత్మజమ్||27||
అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః|
అజ్ఞాప్రతీక్షా దుర్దర్షా రక్షామి నగరీం ఇమామ్||28||

స|| హనుమాత్ తత్ వచనం శ్రుత్వా సా కామరూపిణీ లఙ్కా కృద్ధా పవనాత్మజం పరుషం వచనం ఉవాచ||అహం మహాత్మనః రాక్షస రాజస్య ఆజ్ఞాప్రతీక్షా ఇమామ్ దుర్ధర్షా నగరీం రక్షామి ||

తా|| హనుమంతుని ఆ వచనములు విని అ కామరూపిణి లంకిణి కోపముతో పరుషమైన మాటలతో పవనాత్మజునితో ఇట్లు పలికెను. "నేను మహాత్ముడగు రాక్షస రాజు ఆజ్ఞ మీదా దుర్ధర్షమైన ఈ నగరమును రక్షించుచున్నాను".

శో|| న శక్యా మామవజ్ఞాయ ప్రవేష్ఠుం నగరీ త్వయా|
అద్య ప్రాణైః పరిత్యక్తః స్వప్స్యసే నిహతో మయా||29||
అహం హి నగరీ లఙ్కా స్వయమేవ ప్లవంగమ|
సర్వతః పరిరక్షామి హ్యేతత్తే కథితం మయా||30||

స|| మాం అవజ్ఞాయ త్వయా నగరీం ప్రవేష్ఠుం న శక్యా| అద్య మయా నిహతః ప్రాణైః పరిత్యక్తః స్వప్స్యసే|| హే ప్లవంగమ ! అహం స్వయమేవ నగరీ లఙ్కా | సర్వతః పరిరక్షామి ఏతత్ తే కథితం||

తా|| "నన్ను కాదని నీకు ఈ నగరము ప్రవేశించుటకు శక్యము కాదు. ఇప్పుడు నా చేత చంపబడి ప్రాణములు కోల్పోయి శాశ్వత నిద్ర పోయెదవు. నేను స్వయముగా లంకా నగరపు లంకిణి. ఈ నగరమును అన్నివైపులనుంచి రక్షించుచున్నాను. ఇది నీకు చెప్పుచున్నాను."

శో|| లఙ్కాయా వచనం శ్రుత్వా హనుమాన్మారుతాత్మజః|
యత్నవాన్ స హరిశ్రేష్ఠః స్థితశ్శైల ఇవాపరః||31||
స తాం స్త్రీరూప వికృతాం దృష్ట్వా వానరపుంగవః|
అబభాషేఽథ మేధావీ సత్త్వవాన్ ప్లవగర్షభః||32||

స||మారుతాత్మజః సః హనుమాన్ లఙ్కాయాః వచనం శ్రుత్వా యత్నవాన్ సః హరిశ్రేష్ఠః అపరం శైలః ఇవ స్థితః||సః మేధావీ సత్త్వవాన్ ప్లవగర్షభః వానపుంగవః స్త్రీరూప వికృతాం తాం అబభాషే||

తా|| ఆ మారుతాత్మజుడు హనుమంతుడు లంకిణి యొక్క ఆమాటలు విని ఆమెకి ఎదురుగా పర్వతాకారములో నిలబడెను. మేధావి , సత్త్వము గలవాడు, ఎగురగలవారిలో గరిష్ఠుడు వానరపుంగవుడు అయిన హనుమంతుడు, వికృతమైన స్త్రీరూపములో నున్న ఆమె తో ఇట్లు పలికెను.

శో|| ద్రక్ష్యామి నగరీం లఙ్కాం సాట్టప్రాకారతోరణామ్|
ఇత్యర్థమిహ సంప్రాప్తః పరం కౌతూహలమ్ హి మే ||33||
వవాన్యుపవనానీహ లఙ్కాయాః కాననానిచ |
సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమాగమనం హి మే|| 34||

స|| సాట్టప్రాకారతోరణాం లఙ్కాం ద్రక్ష్యామి | ఇత్యర్థం ఇహ సంప్రాప్తః | మే పరం కౌతూహలం హి||ఇహ వనాని ఉపవనాని కాననాని చ ముఖ్యాని గృహాని సర్వతః ద్రష్ఠుం మే ఆగమనం హి||

తా|| "బురుజులు ప్రాకారములు గల ఈ లంకానగరము చూచుటకై ఇచ్చటికి వచ్చిన వాడను. నాకు చాలా కుతూహలముగా వున్నది. ఇక్కడి వనములు ఉద్యానవనములు ముఖ్యమైన గృహములు అన్ని చూచుటకు వచ్చినవాడను."

శో|| తస్య తద్వచనం శ్రుత్వా లఙ్కా సా కామరూపిణీ|
భూయ ఏవ పునర్వాక్యం బభాషే పరుషాక్షరమ్||35||
మామనిర్జిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వరపాలితామ్|
న శక్యమద్య తే ద్రష్టుం పురీయం వానరాధమా||36||

స|| తస్య తత్ వచనం శ్రుత్వా సా కామరూపిణీ భూయ ఏవ పునః పరుషాక్షరం (వాక్యం) బభాషే|| హే దుర్బుద్ధే వానరాధమా మాం అనిర్జిత్య రాక్షసేశ్వర పాలితాం ఇయం పురీం అద్య తే ద్రష్ఠుం న శక్యం||

తా|| హనుమంతుని యొక్క ఆ మాటలు విని ఆ కామరూపిణి మళ్ళీ పరుషమైన వచనములతో ఇట్లు పలికెను. "ఓ దుర్బుద్ధిగలవాడా వానరులలో అధముడా ! నన్ను జయించకుండా రాక్షసేంద్రునిచే పాలింపబడు ఈ నగరము ఇప్పుడు చూచుటకి నీ అశక్యము."

శో|| తతస్స కపిశార్దూలః తాం ఉవాచ నిశాచరీమ్|
దృష్ట్వాపురీం ఇమాం భద్రే పునర్యాస్యే యథాగతమ్||37||

స|| తతః స కపి శార్దూలః తాం నిశాచరీమ్ (పునః ఉవాచ) ||హే భద్రే ఇమాం పురీం దృష్ట్వా యథాగతం పునః యాస్యే||

తా|| అప్పుడు ఆ కపిశార్దూలుడు ఆ రాక్షసితో ఇట్లు పలికెను. " ఓ మంగళప్రదముగానున్నదానా ! ఈ నగరము చూచి వచ్చిన విధముగనే పోయెదను" అని.

శో|| తతః కృత్వా మహానాదం సావై లఙ్కా భయావహం |
తలేన వానరశ్రేష్ఠం తాడయామాస వేగితా ||38||
తతస్స కపిశార్దూలో లఙ్కయా తాడితో భృశమ్|
ననాద సు మహానాదం వీర్యవాన్ పవనాత్మజః||39||

స|| తతః భయావహం మహానాదం కృత్వా సా లఙ్కా వేగితా తలేన వానరశ్రేష్ఠం తాడాయామాస | తతః లఙ్కయా భృశం తాడితః కపిశార్దూలః వీర్యవాన్ మారుతాత్మజః సు మహానాదం ననాద||

తా|| అప్పుడు భయంకరమైన నాదము చేసి ఆ లంకిణి వేహముగా వానరశ్రేష్ఠుని కోట్టసాగెను.అప్పుడు ఆవిధముగా లంకిణి చేత గట్టిగా కోట్టబడినవాడై కపిశార్దూలుడు, పరాక్రమవంతుడు అయిన మారుతాత్మజుడు భయంకరమైన శబ్దము చేసెను.

శో|| తతస్సంవర్తయామాస వామహస్తస్యసోఽఙ్గుళీః|
ముష్ఠినాఽభిజఘానైనాం హనుమాన్ క్రోధమూర్చ్ఛితః||40||
స్త్రీచేతి మన్యమానేన నాతి క్రోధః స్వయం కృతః|
సా తు తేన ప్రహారేణ విహ్వలాఙ్గీ నిశాచరీ||41||
పపాత సహసా భుమౌ వికృతానన దర్శనా|
తతస్తు హనుమాన్ ప్రాజ్ఞస్తాం దృష్ట్వా వినిపాతితామ్||42||
కృపాం చకార తేజస్వీ మన్యమానః స్త్రియమ్ తు తామ్|

స|| తతః సః హనుమాన్ క్రోధమూర్ఛితః వామ హస్తస్య అఙ్గుళీఃసంవర్తయామాస | ఏనామ్ ముష్టినా అభిజఘాన||స్త్రీ చ ఇతి మన్యమానేన స్వయం అతిక్రోధః న కృతః| సా నిశాచరీ తు తేన ప్రహారేణ విహ్వలాఙ్గీ వికృతానన దర్శనా సహసా భూమౌ పపాత ||తతః ప్రాజ్ఞః వినిపాతితాం తాం దృష్ట్వా తాం స్త్రియం తు మన్యమానః కృపాం చకార |

తా||అప్పుడు ఆ హనుమంతుడు మిక్కిలి కోపము కలవాడై తన ఎడమ చేతి యొక్క వేళ్లను మడిచి , ఆపిడికిటతో ఆమెను కొట్టెను. ఆమే స్త్రీ అని తలచి తను స్వయముగా అతి క్రోధము చేయలేదు. ఆ వికృతమైన కళ్ళుగల రాక్షసి ఆ దెబ్బతో బెదురుపోయి వెంటనే భూమిమీద పడిపోయెను. అప్పుడు తేజస్వి ప్రాజ్ఞుడు అయిన హనుమంతుడు అలా పడిపోయిన ఆమెను చూచి జాలిపడెను.

శో|| తతో వైభృశ సంవిగ్నా లఙ్కా సా గద్గదాక్షరమ్||43||
ఉవాచ గర్వితం వాక్యం హనూమంతం ప్లవఙ్గమమ్|
ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ||44||
సమయే సౌమ్య తిష్ఠంతి సత్త్వవంతో మహాబలాః|
అహం తు నగరీ లఙ్కా స్వయమేవ ప్లవఙ్గమ||45||

స|| తతః సా లఙ్కా భృశ సంవిగ్నా గద్ గదాక్షరం అగర్వితం ప్లవఙ్గమమ్ హనూమంతం ఉవాచ| హే మహాబాహో ప్రసీద | హరిసత్తమ త్రాయస్వ|| సౌమ్య సత్త్వవంతః మహాబలాః సమయే తిష్ఠంతి | ప్లవఙ్గమ అహం తు స్వయమేవ నగరీ లఙ్కా ||

తా|| అప్పుడు ఆ లంకిణి ఎంతో భయముతో గద్గదస్వరముతో గర్వముకోలుపోయి హనుమంతునితో ఇట్లు పలికెను. " ఓ హరిసత్తమ రక్షింపుము. ఓ సౌమ్యుడా! సత్వము గలవారు మహాబలవంతులూ సమయానుకూలముగా వర్తిస్తారు. ఓ ప్లవంగమ నేను స్వయముగా లంకానగరి లంకిణిని."

తా|| నిర్జితాహం త్వయా వీర విక్రమేణ మహాబల|
ఇదం తు తథ్యం శృణూవై బ్రువంత్యా హరీశ్వర||46||
స్వయంభువా పురా దత్తం వరదానం యథా మమ|
యదా త్వాం వానరః కశ్చిత్ విక్రమాత్ వశమానయేత్||47||
తదా త్వయా హి విజ్ఞేయం రక్షసాం భయమాగతమ్
స హి మే సమయః సౌమ్య ప్రాప్తోsద్యతవదర్శనాత్||48||

స|| హే వీర మహాబల అహం త్వయా విక్రమేణ నిర్జితా| హరీశ్వరా ఇదం తు తథ్యం శృణువై|| పురా స్వయంభువా మమ దత్తం వరదానం యథా | యదా త్వాం కశ్చిత్ వానరః విక్రమాత్ వశమానయేత్ తదా రక్షసాం భయమాగయేత్ (ఇతి) త్వయా హి విజ్ఞేయం || హే సౌమ్య స సమయః మే తవ దర్శనాత్ సంప్రాప్తః||

తా||ఓ వీరా ! మహాబలవంతుడా ! నేను నీ పరాక్రమముచేత జయించబడినదానను. ఓ హరీశ్వరా పూర్వము స్వయంభువే నాకు వరము ఇచ్చెను. ఇది తథ్యము నీవు వినుము. ఏప్పుడు నువ్వు ఒక వానరుని పరాక్రమము చేత జయింపబడుదువో అప్పుడు రాక్షసులకు కీడు కలుగును అని గ్రహించుము. ఓ సౌమ్యుడా నీ దర్శనము చేత ఆ సమయము వచ్చినదని గ్రహించుచున్నాను"

శో|| స్వయంభూవిహితః సత్యో న తస్యాస్తి వ్యతిక్రమః |
సీతానిమిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మనః||49||
రక్షసాం చైవ సర్వేషాం వినాశః సముపాగతః|
తత్ప్రవిశ్య హరిశ్రేష్ఠ పురీం రావణపాలితామ్||50 ||
విధత్స్వసర్వ కార్యాణి యాని యానీహ వాంచ్ఛసి||51||

స|| స్వయంభూవిహితః | సత్యః| తస్య వ్యతిక్రమః న అస్తి|| దురాత్మనః రాజ్ఞ్జః రావణస్య సర్వేషాం రక్షసాం చ సీతానిమిత్తం వినాశః సముపాగతః|| హే హరిశ్రేష్ఠ తతః రావణ పాలితాం పురీం ఇహ ప్రవిశ్య యాని యాని కార్యాణి వాంచ్ఛసి తత్ సర్వకార్యాణి విధత్స్వ||

తా|| "స్వయంభువు మాట సత్యము. దానికి తిరుగులేదు.దురాత్ముడైన రాజు రావణుని , రాక్షసులందరికీ సీత కారణముగా వినాశము కలుగనున్నది. ఓ హరిశ్రేష్ట కనుక ఈ రావణపాలిత లంకానగరము ప్రవేశించి ఏమి ఏమి కార్యములు చేయదలచినావో ఆ కార్యములన్నీ చేసుకో".

శో|| ప్రవిశ్య శాపోపహతం హరీశ్వరః
శుభాం పురీం రాక్షస ముఖ్యపాలితామ్|
యదృచ్ఛయా త్వం జనకాత్మజాం సతీమ్
విమార్గ సర్వత్ర గతో యథా సుఖమ్||52||

స||హరీశ్వర శాపోపహతం రాక్షసముఖ్య పాలితాం శుభాం పురీం యదృచ్ఛయా ప్రవిశ్య త్వం సర్వత్ర గతః యథాసుఖం సతీం జనకాత్మజాం విమార్గస్వ||

తా|| ఓ వానరోత్తమ శాపగ్రస్తమైన రాక్షసరాజు చే పాలింపబడు శుభమైన ఈ నగరమును నీ ఇష్టమువచ్చినట్లు ప్రవేశించి అన్ని చోటలకు పోయి సుఖముగా సతీ సీతను వెతుకుము".

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే తృతీయ స్సర్గః||

ఈ విధముగా వాల్మీకి సుందరకాండలో మూడవ సర్గ సమాప్తము

||ఓమ్ తత్ సత్||